25, ఫిబ్రవరి 2014, మంగళవారం

మూడు చేపల కథ





ఇది మనందరికీ తెలిసిన కథే, మనం చిన్నప్పుడు చదువుకున్నది. ఎప్పుడో పుస్తకాల్లో చూసినట్లు గుర్తు. ఇప్పుడు ప్రతిచోటా చూడచ్చు.

ఒక చెరువులో చాలా చేపలు వున్నాయి, అందులో మూడు చేపలు మంచి స్నేహితులు.
మొదటి చేప ఆ చెరువులో చేపలు పట్టడానికి ఏదోఒక రోజు చేపలు పట్టే వాళ్ళు వస్తారని ముందే గమనించి వేరే చెరువుకు వెళ్దామని మిగిలిన రెండు చేపలకి చెప్పింది.

రెండో చేప "వాళ్ళు వచ్చినప్పుడు చూడచ్చు, ముందునుంచీ బయపడటం దేనికీ, తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి వాళ్ళనైనా మనం బురిడీ కొట్టించచ్చు, ఎలాంటి పరిస్థితిలోనైనా మనం బయట పడచ్చు" అని చెప్పింది.

మూడోచేప మాత్రం "వాళ్ళు మన చెరువుకు రారు బయపడాల్సింది ఏమీలేదు, మనచుట్టూవున్న చేపలు ఎలాగూ ఇక్కడే వున్నాయి, అవి ఎటు వెళ్తే మనముకూడా అటే వెళ్దాం. ఒక వేళ వాళ్ళు వస్తే మనమేదొరుకుతామని ఏముంది ? అయినా ఎలా జరగాలో అలా జరుగుతుంది" అంది.

!!***********!!

ఇక్కడ చెరువు మనముంటున్న సమాజం అనుకుంటే అందులోని చేపలు మనమే అనమాట.
ఇక చేపలు పట్టే వాళ్ళు అంటే కొన్ని వేల సంవత్సరాలనుంచి మనల్ని పరిపాలించటం తెలిసిన రాజులు, నాయకులు అనమాట.

!!***********!!

మొదటి చేప ఆ చేపలు పట్టే వాళ్ళు వస్తారని తెలిసి అక్కడనుంచి వేరే చెరువులోకి వెళ్ళిపోయింది.
ఇక్కడ ముందే వెళ్ళిపోయిన మొదటి చేపకు తెలియంది ఒకటుంది.
మొదటి చేపకు తెలియందేంటంటే అక్కడ ఆ చెరువులో కూడా చేపలు పట్టడానికి ఇప్పటికే చేపలు పట్టే వాళ్ళు వున్నారని, ఒకవేళ ప్రస్తుతానికి లేకపోయినా ఇక్కడ చేపలు అయిపోగానే వాళ్ళు ఆ చెరువుకు వస్తారన్నసంగతి.

కొన్ని రొజుల్లో ఊహించినట్లుగానే కొందరు చేపలుపట్టేవాళ్ళు వచ్చారు. వాళ్ళ చేపల వలలో కొన్ని చేపలు పడ్డాయి, అందులో మన రెండో చేప మూడో చేప రెండూ పడ్డాయి.

రెండో చేప తెలివిగా చచ్చిపోయినట్లు నటించింది. దాన్ని చూసిన చేపలవాడు అది ఎలాగు చచ్చింది కదా అని మళ్ళీ ఆ చెరువులో పడేసాడు.
తన తెలివితేటలతో తప్పించుకున్న రెండో చేప అవకశవాది రకం, తన తెలివితేటలతో ఎవరినైనా తన బుట్టలో వేసుకోగలదు.

ముడో చేప ఏమి చేయాలో తెలీక అన్ని చేపల్లానే చేపలవాడికి చిక్కి వాడి బుట్టలోపడింది.

ఇక మిగిలింది మూడో చేప - చేపలవాడు.
ఆ చేపలవాడి దగ్గర వలవున్నంతకాలం ఆ చేప వాడి వలలో పడుతూనేవుంటుంది.

2 కామెంట్‌లు:

swathi చెప్పారు...

In your story u said that first fish does not know that there will also fisher man where its travelling but it wants to swim to big lake where the chance of getting caught in the net is less when compared with a pond which has no water.it can be caught easily where water is going to dry easily in summer and coming to second one it has taken instantaneous action to protect herself. finally the third one who does not responds get caught.

The fishes cannot revolt or attack the fisherman and hence according them dealing with the fisherman timely is correct.how come it will "avakasavaadam" or some other thing.its a story to tell how how to take decision
timely.kindly read the story once agin.

srikanth చెప్పారు...

నేను ఆ చేపల్ని మనుషులతో, జాలరులని రాజకీయనాయకులతో ఊహిస్తూ అనుకున్నది మాత్రమే

చిన్నప్పటి ఆ కథలో తాత్పర్యంవేరు ఎందుకంటే అక్కడ వున్నది చేప. ఇక్కడి నా కథ అర్దంవేరు ఎందుకంటే ఇక్కడ నా ఊహ మన సమాజం.