అది శ్రావణ అమావాస్య September 11వ తేది.
రాహుకాలం, యమగండం రెండూ ఒకేసారి రైలెక్కివచ్చాయి. సమయం పావు తక్కువ 3. "Vijayawada నుంచి ongole వెళ్ళవలసిన పాసింజరు రైలు 10వ No.platform మీద వున్నది" అని announcement జరిగింది. ఎడారిలో ఆముదం చెట్టులాగా ఆ platform మీద నేనొక్కడినే ఉన్నా.
Train 3:15ని లకు బయలుదేరాలి కాని ఎవ్వరూరాలేదు. హఠాత్తుగా సునామి వచ్చినట్లు తండోపతండాలుగా జనాలు ఎక్కారు.
--------------------------------------------------------------------------------------------
"నేను,ఒక ఆవిడ, ఇంకోఆయన, అరడజను పిల్లలూ" ఇది నా జీవితం కాదు, రైలులో నా బర్తు. రైలు 3:29:18sec లకు శుభదుర్ముహూర్తాన బయలుదేరింది.
రైలు ఆగకుండా అరగంటలో అరకిలోమీటర్ వెళ్ళంది.
నా stage కృష్ణాకెనాల్ stage నుంచి మారుతూవచ్చింది.
Nice shirt & nice trouser కాని చేతిలో బకెట్టు, మగ్గు. "good idea" అని నాపక్కన ఉన్న వ్యక్తి complement ఇచ్చాడు.
ఇదే అర్థం కాక నేను చస్తుంటే, "uncle 17 ఎనిమిదులు ఎంత ?"అని ఇట్నుంచి ప్రశ్న ఫోను వచ్చినట్లు buildup ఇచ్చి calculator లో చేసి answer చెప్పా.
సమయం 4:10ని
కూ............!
అరగంటలో బయలుదేరబోయే train కి కూతవేసాడు.
కడుపులో కుంభకర్ణుడు నిద్రలేస్తున్నాడు. అందరూ బాగ్స్ తెరిచారు, చూస్తే బట్టలు లేవు బఠానీలు, బాదూషాలు, బూందీ ...అబ్బా....................................................!!!!!!!!
ఆఖరికి, పల్లీలవాడుకూడా దరిదాపుల్లో లేడు.
కొన్ని అడుగుదామనుకున్నా అడుక్కునేవాడనుకుంటారని మానేసా.
రోజూ పేపర్లో చదువుతున్నా ప్రపంచం పరిగెడుతోందని కాని ఈ train కుంటుతోంది.
--------------------------------------------------------------------------------------
కళ్ళు తెరిచా 'తెనాలి ', హమయ్య అని టైం చూసా 7:00. బయట అందరూ స్నానాలు చేస్తున్నారు.
బక్కెట్టు 2/- ,ఒక బక్కెట్టు కొంటే ఇంకోటి ఉచితం ఇలా ఆఫర్లతో
టీ","కాఫీ".....అని వినబడటంతో
నేను: బాబూ ఒక కాఫీ
నేను:యెంత
వాడు: 15/-
నేను:పదిహేనా?
వాడు: coffee అంటే cof"free" కాదు ,...
అని ఇచ్చిన 20/- జేబులో పెట్టుకొని ఉగ్గుగిన్నెలో ఏదో నా ముఖాన గొట్టడు.
జన సంద్రం స్నాన-పానాలు చేసారు, ఆడవాళ్ళు జడలు వేసుకొని, పూలు పెట్టుకొని మరీ ready అయ్యారు .
---------------------------------------------------------------------------------------------
రైలు మళ్ళీ బయలుదేరింది. అరగంటక్రితమే కూతవేసాడు.
"మీరెక్కడిదాకా వెళ్తారు?"
ఒంగోలు
"మీరు?"
"next ఎక్కడ ఆగితే అక్కడ, నాకు ప్రతి ఊరిలో family ఉంది."
""""మీరు ఏంచేస్తారు?..ఎక్కడుంటారు?....అమ్మానాన్న?.......పెళ్ళి-గిళ్ళి?.......
ఉద్యోగం-సద్యోగం?......చదువు-సంద్య?..........మీపాడె-పిండాకూడు!!!!!!!
వీళ్ళ భాద భరించలేక మళ్ళీ పడుకున్నా. చాలా మంచి నిద్ర పట్టింది. కళ్ళుతెరిచా నా ఒళ్ళో ఇద్దరు పిల్లలు పడుకున్నరు, నామీద ఇంకొకడు పడ్డాడు.
రాత్రి 11 గంటలైంది. చీరాల రైల్వే station లో ఆగింది.
డ్రైవర్ దిగి "భోజనాలు చేసేవాళ్ళు, ఊళ్ళో బంధువులను చూసే వాళ్ళు వెళ్ళిరావచ్చు మీరొచ్చేదాకా బండి ఇక్కడే ఉంటుంది" అని చెప్పి మరీవెళ్ళాడు.
నా జీవితంలో మొదటిసారి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.
--------------------------------------------------------------------------------------------
రైలు దిగాను.
ఇద్దరు 'SCRMU' railway వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
మొదటివాడు:ఏంటి ఈరోజు ఇంతతొందరగా వచ్చింది
రెండోవాడు :డ్రైవర్ మన రంగయ్య మనవడు
మొదటివాడు:వాడు ఉద్యోగంలో చేరాడా??
రెండోవాడు :రంగయ్య పోయాక వాళ్ళ కుటుంబంలో ఒకడికి ఉద్యోగం ఇవ్వమన్నారు, వీడు రోడ్ల మీద తిరుగుతుంటే తీసుకొచ్చి పడేసారు
మొదటివాడు:ఎలా తోలుతున్నాడు
రెండోవాడు :వాడివయసుకు తగ్గట్టు 25
మొదటివాడు:చాలా ధైర్యవంతుడు
రెండోవాడు :అన్నీ రంగయ్య పోలికలే
(ఇంతలో 'రైల్వేజ్యోతి ' పేపర్ తీసుకొని ఇంకొకడు వచ్చాడు)
మూడవ వాడు : బెంగాల్ లో ని ఒక రైలు లో కవల పిల్లలు పుట్టారు, వారికి "రై","లు" అనే పేర్లు పెట్టారు.
మొదటి వాడు : మరి మన రాష్ట్ర పరిస్థితి ?
మూడవ వాడు : కరక్టుగా రైలు వచ్చిందని తెలిసి 44 ఏళ్ళ వ్యక్తి heart attack తో మృతి.
వీళ్ళు నన్ను భయపెడుతున్నారో, జాగ్రత్తలు చెబుతున్నారో అర్థం కావటంలేదు,
మళ్ళీ వెళ్ళి రైలులో నిలబడ్డా
ఇక లాభం లేదని నేనే డ్రైవర్ దగ్గరకు వెళ్ళి "అంతా వచ్చారు, రైలు పోనిమ్మని చెప్పా...
మళ్ళీ రైలు కూత వేసింది, అరగంటకు మళ్ళీ బయలుదేరింది,
దోమల శబ్దం కూడా వినబడనంత వేగంగా రైలు వెళుతోంది.
ఓ పేపర్ తీసుకొని విసురుకుంటూ ఓ మూల పడుకున్నా...
కోడి కూత వినపడగానే లేచా, సూరీడు రావటానికి ఓ పదినిమిషాలు ఉంది,
రైల్వే చరిత్రను తిరగ రాస్తూ ఓ TC నా దగ్గరకు వచ్చి ticket అడిగాడు, చూపించాను, license ఉందా ?
ఏంటి?
license లేకపోతే 50/- fine అన్నాడు,
నా పక్కాయన 'పాపం నిన్నటి నుండీ ఇక్కడే ఉన్నాడు ' అని చెప్పగానే నా మీద దయ చూపించాడు
--------------------------------------------------------------------------------
ఇంతలో walking train ని ఒకడెక్కాడు, tc వాడిని పట్టుకున్నాడు, వాడి license,passport .......... అన్నీ కలిపి 200/- తీసుకొని, ఇంకొకడి దగ్గరకి......
ఇంకాసేపటిలో ఊరు వస్తుందనగా
" నా ఊరు , నా నేల, నా గాలి, ఆహా ఎంత ఆనందంగా ఉందో!!! ",అని అనుకున్నానో లేదో
దానికి చెవులు ఉన్నట్టున్నాయి ఆగింది ,
మళ్ళీ అరగంటకు కూత,
చచ్చీచెడీ ఒంగోలు లో పడ్డా
కుస్తీలు పడుతూ ఇంటికి వెళ్ళా, తాళం వేసుంది,
ఇంతలో ఫోను మోగింది,
ఫోనులో నాయిన
"ఏంటీ, ఎక్కడున్నవ్ ?? మేము ఉదాయాన్నే ఎడ్లబండిలో విజయవాడకు మూడు గంటల్లో వచ్చాం,
నువ్వు పాసింజర్ పట్టుకుని విజయవాడకు మళ్ళీవచ్చేయ్ ....
???????????????
5 కామెంట్‌లు:
it is a nice story. I have not read such type of story in my life time.
తమాషాగా ఉంది. కానీ విజయవాడని ఒంగోలునీ ఆంగ్ల లిపిలో రాయవలసిన అవసరమేమి??
బావుంది. కథనమూ బాగుంది.
బాగుంది...చదువుతుంటే నవ్వు వఛ్హింది
తెలుగులో(నెట్ లో) నేను చదివిన మొదటి కధ....చాలా బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి