మనిషి గాలిలేకుండా బతకచ్చు, నీరులేకుండా బతకచ్చు, తిండిలేకుండా బతకచ్చు కాని అబద్ధం ఆడకుండా ??????????
ఛాన్సేలేదు
మనిషిని బతికించేది ఈ అబద్ధం మాత్రమే
లాలి పప్పా తినే వయసు నుంచి బక్కెట్టు తన్నే వయసు వరకూ
మన ఆత్మ భంధువు ఈ అబద్ధం మాత్రమే
ఈ అబద్ధాలలో మొదటిగా అందరూ చెప్పేది
"అమ్మా కడుపులో నొప్పి, అయ్యా కడుపులో నొప్పి"
ఇది చిన్నపిల్లలలో బాగా ప్రసిద్ధి
మాష్టారు ఇచ్చిన హోంవర్క్ చేయకపోతే మొదటగా వచ్చేది ఇదే ,
ఏంటో ఎన్నిమందులు వాడినా ఇది తగ్గదు
స్కూలు 9గంటలకైతే ఇది 8గంటలకేవస్తుంది ,8.30నుంచే మరీ ఎక్కువ అవుతుంది ,కరెక్టుగా 9.10కి అంతా తగ్గుతుంది
కొన్నాళ్ళకు ఇది మరీ చీప్ గా కనిపిస్తుంది
ఇకనుంచి లెక్చరర్ కి లేటైన ప్రతిసారి బస్సులేటు అనే సాకు ఒకటి పడేస్తాం
యగొట్టిన ప్రతిసారీ "అన్నపెళ్ళనో, అక్కపెళ్ళనో, ....."
ఇది నాలుగుసార్లు వాడినతరువాత మరీ ఎక్కువ రోజులైతే
"బామ్మగారు పొయారండి" అనో "తిరుపతో ,కాశీ యో......." పోతారు
మరచిపొయా ఎప్పుడైనా మాష్టారు "ఏం మాట్లాడుతున్నారురా?" అని లేపారా
మన దగ్గర నుంచివచ్చే సమాధానం ఒక్కటే "పెన్ను అడుగుతున్నాను సార్" అని
ఇక పెద్దవాళ్ళు ఐతే ఈ బాధ్యత మరీ ఎక్కువ అవుతుంది
"సారు గారు ఉన్నరా అండి "
"అరరే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే బయటకు వెళ్ళారు "
వాళ్ళ నాన్నగారు పోయి 15సం అవుతోంది ఇప్పటికి మనోడు చంపింది మాత్రం 20 సార్లు
ఫొన్ లో మనకి నచ్చనోడు ఫొన్ చేస్తే "busyగా వున్న మళ్ళీ మాట్లాడ్తా" ఇంక ఏముంది ఫొన్ switch ఆఫ్
problem solved
ఈ పదాలన్ని మనకోసమే కనుగొన్నరేమో అనిపిస్తుంది కొన్నిసార్లు
ఖర్మ కాలి ఎవరైనా ప్రేమలో పడ్డారో ఇక చావే చెప్పిన అబద్ధం చెప్పిన చోట చెప్పకుండా చెప్పక తప్పదు
ఇక మిగతా విషయాలలో చెప్పాల్సిన అవసరం లేదు
పెద్దైతే సందర్భాన్నిబట్టి కోకొల్లలు ఈ అబద్ధాలు
ఈ అబద్ధము 64 కళలలో మొదటిదని సుప్రసిద్ధి
రాజకీయ నాయకులకూ, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అదనపు అర్హత
అందుకే పెద్దలు అంటారు "వింటే భారతమే వినాలి చెబితే అబద్ధమే చెప్పాలి" అని
5 కామెంట్లు:
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
అబద్దం ఒక అవసరం. అది ఎవరూ కాదనలెని నిజం.
హెలో శ్రీకాంత్ గారు.....
మీ బ్లాగ్ చాలా బాఉంది...మీరు రాసిన పోస్ట్స్ కూడా ..చాలా..చాలా బాఉన్నాయి...నిన్న మీ బ్లాగ్ చూసాను..టెంప్లేట్ మార్చారుగా....ఒకె ఫైన్..చాలా బాఉంది..
.........................
ఇక పోతే మీరు ఈ మధ్య రాయడం మానేసారా..???
ఎందుకు...???.. ఓ బిజీగా ఉన్నారా..??? ఐతే పర్లేదు...ఐతే ఏం రాయోద్దు సరేనా...కానీ ఇప్పటి వరకు రాసిన టపాలు ఒకసారి మళ్ళీ పోస్ట్ చేయండి ప్లీజ్...మీకు తెలుసా..మీరు అసలు చాలా బా రాసారు..అయబాబోయ్..నేను మీ ఫ్యాన్ అయిపోయానండి..నిజం నమ్మండి...
మీతో ఒక చిన్న మనవి.......
మీరు మరొకమారు..మీ టపాలను ఎందుకు పోస్ట్ చేయకూడదు....
చాలా మందికి మీ బ్లాగ్ తేలీదు...ఒక్కసారి చూసారనుకోండి..ఇక వదలరు....కాబట్టి..నాదొక రిక్వెస్ట్....మీరు మళ్ళీ ఒకసారి మీ టపాలను పోస్ట్ చేయండి ప్లీజ్.....
ఇంత బాగా రాసే మీరు ఇలా గమ్మున ఉండడం ఏం బాగో లేదు....మీరు మళ్ళీ రాయాలి....
రాస్తారు కదూ..ప్లీజ్..ప్లీజ్..ప్లీజ్...ప్లీజ్...
.......................
త్వరలో వచ్చే మీ కొత్త పోస్ట్ కోసం అందరం వెయిట్ చేస్తుంటాము......ba bye friend..
మీనాక్షి...!!!
మమ ఏంటే అరిపించావ్ గా మళ్ళి చదువుతుంటే అసలు పిచ్చెక్కించావ్ ర
బావుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి