9, సెప్టెంబర్ 2008, మంగళవారం

పోస్టు చేయని ఉత్తరం

జోరున వర్షం కురుస్తోంది, అమ్మతో కలిసి ఎంతో ఆనందంగా ఇంట్లో ఆడుకుంటున్నాడు రవి.

కాసేపటికి వర్షం తగ్గటంతో ఇంటి ముందు ఉన్న నీళ్ళలో పడవలతో ఆడుకోసాగాడు.


" రవీ నీళ్ళలో తడవకూ, లోపలికు రా ",అని రవి అమ్మ అరిచింది .

" ఈ ఒక్క రోజేకదా అమ్మా, నువ్వుకూడా రా ఆడుకుందాము",అని రవి అడిగాడు.

అమ్మతో కలిసి హాయిగా ఆడుకుంటున్నాడు

'అమ్మా ఇంకో పడవ చేసీవా' అని రవి అడిగాడు

రవి అమ్మ రవికి రెండు పడవలు చేసిచ్చింది


ఇంతలో ' రవి నుంచో ', అని ఎవరో అరిచినట్లు వినిపించింది

రవి ఉలిక్కిపడి లేచాడు, ఎదురుగా తెలుగు మాస్టారు,

'ఇప్పుడు ఏమి చెప్పానో చెప్పు ', అని మాస్టారు అడగగానే తలదించుకొని నిలబడ్డాడు రవి

'నేను వెళ్ళే దాకా అలాగే నిలబడి ఉండు, క్లాసులో నిద్రపోతావా?',

అని మాస్టారు పాఠం చెప్పసాగాడు.

అప్పుడు అర్థమైంది రవికి మాస్టారు చెప్పేది లేఖ గురించి అని.

' సెలవు కోరుచూ ప్రధానోపాధ్యాయునికి లేఖ , ఇది మీకు పది మార్కులకి ఇస్తాను ఈ సారి '

అని మాస్టారు చెప్పసాగారు.

అందరూ శ్రద్ధగా విన్నారు ,నిద్రమత్తు వదలటంతో రవికూడా విన్నాడు.


లంచ్ బెల్ కొట్టారు, అందరూ పరుగెడుతూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు

హాస్టల్ అంటే అలాగే ఉంటుంది మరి

భోజన సమయం అవటంతో అందరూ పళ్ళాలు పట్టుకోని భోజనానికి వెళ్తున్నారు

కాని రవి మాత్రం తెలుగు మాస్టారు చెప్పిన లేఖ గురించి ఆలోచించ సాగాడు.

' రవి వెళ్దాము రారా ', అని స్నేహితులు అడగగా

' మీరు వెళ్ళండిరా నేను తరువాత వెళ్తాను ', అని చెప్పి ఒంటరిగా రూములో కూర్చున్నాడు

మాస్టారు చెప్పిన లేఖ గురించే ఆలోచించ సాగాడు

దానిలొ ప్రధానోపాధ్యాయుడికి బదులు అమ్మకు లేఖ వ్రాయాలనిపించింది రవికి


రవికి అమ్మని చూసి చాలా రోజులైంది

హాస్టల్లో చేర్చినప్పటినుంచి అమ్మ మీద బెంగ పెట్టుకున్నాడు

అప్పుడప్పుడూ వాళ్ళ నాన్న వచ్చి చూసి వెళ్ళినా పన్నెండేళ్ళ రవికి మాత్రం అమ్మతోనే ఉండాలని ఆశ

అందుకే అమ్మకి లేఖ వ్రాయాలనిపించింది రవికి


మాస్టారు చెప్పిన నమూనా లేఖని దగ్గర పెట్టుకోని వ్రాయసాగాడు******************************************************
తేది :10-02-95,

హైదరాబాద్.అమ్మకి ,

మినర్వా పబ్లిక్ స్కూల్ ,

హైదరాబాద్.విషయం:అమ్మని రమ్మని అడుగుతూ లేఖ

అమ్మా నేను రవిని. ఇప్పుడే క్లాసులు అయిపోయాయి,

అందరూ భోజనానికి వెళ్ళారు. నేను కాసేపు ఆగి వెళ్తాను. ఈరోజు లేఖ రాయటం ఎలాగో నేర్పించారు,

మొదటి లేఖ నీకే వ్రాస్తున్నాను.నాన్న ఎలా ఉన్నారు. మొన్న వస్తానన్నారు రాలేదు ఎందుకని ?

ఆ రోజు చాలామంది తల్లిదండ్రులు వచ్చారు, నేను మీకోసం చాలా సేపు చూసాను,

మీరెందుకు రాలేదు ? వాళ్ళందరినీ చూస్తే ఎందుకో నాకు ఏడుపొచ్చింది. ఇక్కడ ఒక సార్

వున్నారు తెలుసా ఆయన కూడా నాన్నలాగా భలే కధలు చెబుతారు.

నువ్వు ఎలా చదువుతున్నావు అని అడుగుతారు అంతేగా , నేను బాగానే చదువుతున్నాను.

క్లాసులో నాకు 4వ ర్యాంకు వచ్చింది . లెక్కల్లో 25/25 వచ్చాయి తెలుసా, లెక్కల

మాస్టారు నన్ను మెచ్చుకున్నారు కూడా. ఐనా ఎందుకో నాకు హాస్టల్ నచ్చలేదమ్మా,

నేను మన ఊరు వచ్చేస్తాను . వీళ్ళు ఇక్కడ నన్ను ఆడుకోనివ్వటం లేదు,

వర్షం లో తడవనివ్వటం లేదు , నాకు నచ్చినవి చేయనివ్వటం లేదు , రోజూ చదవమంటారు.

నాకు ఇక్కడ గోపి , రమేష్ అనే ఫ్రండ్సు ఉన్నరు తెలుసా . నువ్వు ఇక్కడకి వస్తే చూపిస్తా వాళ్ళని ,

నువ్వు కూడా నాతో ఆడతావు అంటుంటే వాళ్ళు నమ్మటం లేదు.

ఒక సారి నువ్వు వస్తే అందరం కలసి ఆడుకుందాం. ఈసారి సెలవులలో అమ్మమ్మావాళ్ళ

ఊరు వెళ్దాం, అక్కడ బాగా ఆడుకోవచ్చు, తాతతో కలిసి పొలంకి వెళ్ళచ్చు, ఐస్ క్రీములు,

చాక్లేట్లు తినచ్చు . తొందరగా సెలవలు వస్తేబాగుండు . నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు?

ఈ ఆదివారం వస్తావా, వచ్చేటప్పుడు నాకు తింటానికి బోలెడు చాక్లేట్లు తేవాలి .

చాక్లేట్లు తిసుకురాకపోయినా పర్లేదు నువ్వు మాత్రం తోందరగా రా. అమ్మా నన్ను మరచిపోవు కదా


ఇట్లు మీ విధేయుడు,

వి.రవి,

7 వ తరగతి,

మినర్వా పబ్లిక్ స్కూల్.


******************************************************

ఎప్పుడో తన చిన్నప్పుడు అమ్మకు వ్రాసిన ఉత్తరాన్ని చూస్తూ నవ్వుకున్నాడు రవి.

తను పోస్టు చేయని ఆ ఉత్తరాన్ని ఎప్పటికీ మరచిపోలేడు రవి .తన పర్సులో నుండి

అమ్మ ఫోటో తీసి చూసుకున్నాడు . తను ఈ ఉత్తరం రాయక ముందే అమ్మ చనిపోయిందని,

అందుకే తనను హాస్టల్లో చేర్చారని అప్పుడు రవికి తెలీదు.

తన చిన్నప్పుడే చనిపోయిన అమ్మని ఒకసారి గుర్తుతెచ్చుకొని తిరిగి తన పనిలో లీనమైపోయాడు

20 కామెంట్‌లు:

రమ్య శ్వెత బూదరాజు చెప్పారు...

మీరు హాస్టల్ లొ ఉన్నారు కదా చిన్నప్పుడు సున్నితమైన అంశం శ్రీకాంత్ గారు.

Unknown చెప్పారు...

ఎక్కడో కలుక్కు మంది ఇది చదువుతుంటే... ఎవరికీ ఈ పరిస్థితి రాకుండా ఉంటే బాగుండు.

Purnima చెప్పారు...

కొన్ని చదివాకా, భలే రాశారు, మరిన్ని చదవాలని ఉంది అని చెప్పలేము. అంత బాగా రాసినవి చదివాక, మనసు మెలిపడితే, అంత తేలిగ్గా ఆ బాధనుండీ తప్పించుకోలేము కదా!

నేనో అంశం మీద రాయాలి అనుకుంటూ వాయిదా వేస్తున్నాను. మీ టపా అయినా ఆ ధైర్యాన్ని ఇస్తే బాగుణ్ణు!

అభినందనలు!

కొత్త పాళీ చెప్పారు...

నా ఎనిమిదో తరగతి ఆంగ్ల వాచకంలో ఒక కథ ఉండేది .. ఛెఖోవ్ ది అనుకుంటా. అందులో వెట్టికి దొర ఇంటికి పంపబడిన ఒక పది పన్నెండేళ్ళ పిల్లాడు వాంకా జుకోవ్ తన తాతకి ఉత్తరం రాస్తాడు, ఇక్కడేం బాలేదు, తనని తీసుకెళ్ళి పొమ్మని. అది గుర్తొచ్చింది.
బాగా రాస్తున్నారు. కొనసాగించండి.

గిరిజా కృష్ణ సూర్యదేవర చెప్పారు...

శ్రీకాంత్ గారు, చాలా బాగుంది.

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

అంతా చదివాక చాలా బాధ గా అనిపించింది, బాగా వ్రాశారు.

శ్రీరామ్ నేదునూరి చెప్పారు...

abba ekkaDO kalukku mandi

అజ్ఞాత చెప్పారు...

ఏమని చెప్పను,
చెప్పటానికి మాటలు రావట్లేదు గుండె బరువెక్కింది

మాలతి చెప్పారు...

బాగా రాశారు. మనం రాయలేని వుత్తరాలూ, రాసి పోస్టు చెయ్యని వుత్తరాలూ, మనసులోనే వుండిపోయిన వుత్తరాలూ ... ఎన్నో ... మంచి వస్తువు తీసుకున్నారు. ఉత్తరంలో ఐస్ క్రీం అనడం కంటే అమ్మ చేసిన వంటకం అంటే బాగుండేదేమో ...

రాధిక చెప్పారు...

తేలికపాటి పదాలతో గుండె బరువెక్కించేసారు.
అవును ఉత్తరం చాలా తేలికగా వుంటుందికానీ అది మోసుకొచ్చే ఊసులు మాత్రం బోలెడు.ఎందుకో నాకు ఉత్తరాలు రాయడం అన్నా,చదవడం అన్నా చాలా ఇష్టం.ఎందుకో తెలియదు కానీ ....మీకు థాంక్స్ చెప్పాలని వుంది......థాంక్సండి.

చైతన్య.ఎస్ చెప్పారు...

గుండె బరువెక్కింది...కళ్ళలో చెమ్మ..
బాగా రాశారు.

Srikanth చెప్పారు...

@ రమ్య ...గారు , @ ప్రవీణ్ గార్లపాటి గారు,
@ గిరిజా కృష్ణ గారు , @ ప్రపుల్ల చంద్ర గారు ,
@ చైతన్య గారు , @శ్రీరామ్ నేదునూరి ,
@ aswin

ధన్యవాదములు


@ Purnima గారు
మీరు రాసే ఆ టపా కోసం వేచి చూస్తుంటాము ఆలస్యం చేయకుండా రాసేయండి
ధన్యవాదములు

@ కొత్త పాళీ గారు మీ చిన్నప్పటి కధను ఈ టపా గుర్తు చేసినందుకు నాకు సంతోషంగా వుంది
ధన్యవాదములు

@ te.thulika గారు మీరు చెప్పిన తరువాత నాకూ అమ్మ వంటే నచ్చిందండి
ధన్యవాదములు

@ రాధిక గారు మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదాలండి

shaneer babu చెప్పారు...

శ్రీకాంత్ గారూ కాసేపు గుండెను మెలిపెట్టినట్టైంది సుమీ....

మీనాక్షి చెప్పారు...

chaalaa ba raasaaru..sri gaaru..
em cheppaali asalu maatalu ratam ledu...

ఉమాశంకర్ చెప్పారు...

శ్రీకాంత్ గారు, బాగా రాసారు.

Mitra చెప్పారు...

Very well written.

Unknown చెప్పారు...

hi i also studied at minerva school at kavali. my name is m.srinivasa raju from vijayawada. excellent

Deep చెప్పారు...

chala baga rasaru, chaduvuthoontene kallaloo neelu vachesaye,

Anurup చెప్పారు...

చాల బాగా రాసారు.

హను చెప్పారు...

nice, chala bagumdi nee visleshana, nice
naku telugu bloggerlo naa blog ela add cheyyalo teliyatam ledu akkada blog cherchamdi daggara kottina kuda raava tam ledu, meeru komcham cheppara pls