29, ఆగస్టు 2009, శనివారం

ఇట్లు నీ తొలకరిజల్లు


ఎందుకో ఆఫీసుకి వెళ్తూ లెటర్ బాక్స్ తెరిచాను

తెరవగానే ఓ ఉత్తరం కనిపించింది .

"ఫోన్లు, మెయిల్స్ , ఆర్కుట్ల కాలంలో ఈ ఉత్తరం రాసింది ఎవరబ్బా ?

సర్లే ,సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తరువాత చూద్దాం " అని

ఆ ఉత్తరాన్ని లోపల పడేసి ఆఫీసుకు వెళ్ళాను .


సాయంత్రం (రాత్రి అని కూడా అనచ్చు ) ఆఫీసు నుంచి వస్తున్నాను .

ఈ మధ్య కాలంలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం నేను చూడ లేదు ,

వర్షం పడేటట్లు ఉంది . రూంకి వెళ్ళి వంట చేయాలి అని గుర్తు రాగానే

ఆనందంగా ఉన్న మనసు అదోరకంగా మారింది . ప్రస్తుతం నలుగురు

సహుద్యోగులం కలిసి ఓ ఇంట్లో ఉంటున్నాం . ఈ రోజు (రోజూ ) వంట

నేనే చేయాలి, అప్పుడు అర్ధమైంది ఇంట్లో అమ్మ ఎన్ని కష్టాలు పడుతోందో

అని . పోనీ బయట తిందామా అంటే , దాని కంటే నేను చేసిన

వంటే నయం కనీసం నేనైనా తినగలను .


రూంలో లైట్ వెలుగుతోంది , మావాళ్ళు వచ్చినట్టున్నారు . వంట చేసి

వుంటే బాగుండు అని అనుకుంటూ లోపలికి వెళ్ళాను . అమావాస్య

రోజు వెన్నెల కురవటం - మావాళ్ళు వంట చేయటం జరగవని నాకర్ధమైంది .

నేను చేసిన వంటని (పెంటని) అందరం తిని , ఆఫీసులో మాకు నచ్చని వాళ్ళని

నాలుగు బూతులు తిట్టుకొని పడుకోవటానికి సిద్ధమైనాం . లైట్ ఆపుతుండగా

ఉదయం నేను పడేసిన ఉత్తరం కనిపించింది. 'ఈ కాలంలో ఉత్తరమా దీన్ని

ఎటునుంచి చదవాలో ' మొత్తానికి ఎలాగోలా దాన్ని మొదటినుంచి చదవటం

ప్రారంభించా. చిన్నపుడు మా మాష్టారు చెప్పిన పద్దతిలో లేదు ఈ ఉత్తరం

ఏకంగా నన్ను తిడుతూనే మొదలైంది.

********************************************************

ఉత్తరం: ఏరా బతికే వున్నవా ? బుద్ధుందా అసలు ?
మనిషి జన్మ ఎత్తావా అసలు?

నేను : ఎవరు బాబు నువ్వు , మా బాబులా తిడుతున్నావ్ , ఎవరు నాయనా నువ్వు?

ఉత్తరం: నేనెవరా? అంతేలే మేమెక్కడ గుర్తుంటాంనీకు ?

నేను : ఎవరో తెలుసుకోవటానికి ఉత్తరం వెనక్కి తిప్పా అక్కడ (ఇట్లు నీ)
అని ఎక్కడా లేదు . "వామ్మో ! వీడెవడు రా నాయనా ఫోనులో మా
చిన్న నాటి స్నేహితులు అరిచినట్టు అడుగుతున్నాడు

ఉత్తరం: గుర్తుకు వచ్చానా యిప్పుడైనా ?

నేను : రేయ్ నేను నీకేం అన్యాయం చేసానురా పేరు చెప్పకుండా పీక్కొని తింటున్నావ్ !!!

ఉత్తరం: సరే ఓ క్లూ ఇస్తాను చెప్పు
నన్ను సృష్టించింది నువ్వే. నా సృష్టికర్త నీవే

నేను : వామ్మో! వాయ్యో! అసలు ఈ ఉత్తరం నాకేనా వచ్చింది
పేరు , చిరునామా అంతా ఓకే . మరి కర్త అంటున్దేంటి
నేను ఏ క్రియ చేయకుండా. ఇదేనేమో కర్మంటే .

ఉత్తరం: సరే నేనే చేపేస్తాను

నేను : తిరుపతి కొండెక్కుతూ ఆఖరి మెట్టు చేరుకున్నంత ఆనందం కలిగింది .

ఉత్తరం: నీ పూర్వజన్మలో బ్లాగులు అని కొన్ని ఉండేవి గుర్తుందా వాటిలో
ఒకటి నువ్వు మొదలు పెట్టినది . ఖర్మ కాలి నన్ను తొలకరిజల్లు
అంటారండి గుర్తుకు వచ్హామా?

నేను : ఓ నువ్వా ! ఎలా ఉన్నావు ? చాలా రోజులైంది నిన్ను చూసి ?
బాగున్నావా? ఏదైనా కొత్త టపా ?????

ఉత్తరం: ఏమైనా అన్నానంటే అన్నానంటావు -కొత్త టపా - నాలో -నువ్వు రాయకుండా ???

నేను: హి హి హి :-) అలవాటులో పొరబాటు మామూలుగా అడిగేసా

ఉత్తరం: ఇంతకీ నువ్వు ఎలా వున్నావ్

నేను : నాకేం ! బక్క చిక్కిన గుండ్రయిలా ఉన్నాను

ఉత్తరం: ఒక్కప్పుడు అప్పుడప్పుడు రాసేవాడివి , ఇప్పుడు ఏమైంది ఎప్పుడూ రాయటంలేదు
నేను : :-)

ఉత్తరం: ఛ! ఏంటి అది సమాధానమే
నేను : :-(

ఉత్తరం: నీతో ఇదే ఏదైనా అంటే మూతి ముడుచుకొని కూర్చుంటావు

నేను : నిజమే నేను టపా రాసి చాలా రోజులైంది

ఉత్తరం: అది రోజులు కాదేమో నేలలనుకుంటా.

ఉత్తరం: అయ్యో నాకోసం తొలకరిజల్లు అని ఒక చిన్న బ్లాగు వేచి
చూస్తుంటుంది అని ఎప్పుడైనా అనుకున్నావా ?

నేను : క్షమించు బాబు ఏదో పని లో ఉండి ఇన్ని రోజులు మర్చిపోయా

ఉత్తరం: అంతేలే మేమంటే నీకు చులకన

నేను : అబ్బా! ఇక ఆపు క్షమించమన్నాను కదా ! ఐనా కోపం తెచ్చుకోవటం ఏమి బాలేదు .

ఉత్తరం: ఐనా నీకేం తెలుసు తండ్రి లేని కోడుకన్నా, బ్లాగరు లేని బ్లాగన్న
ఈ లోకానికి ఎప్పుడూ చులకనే

నేను : ఓకే ఇంకెప్పుడూ నిన్ను ఇలా వదిలేయను

ఉత్తరం: సరే

నేను : ఇంతకీ మన బ్లాగు ప్రపంచం ఎలా వుంది ?

ఉత్తరం: శ్రీదేవి లా అందంగా ఉంది. ధోని లా మెరిసిపోతోంది

నేను : అప్పుడప్పుడు మిగతా బ్లాగరులు రాస్తున్న టపాలు చదువుతూనే ఉన్న

ఉత్తరం: అంటే మిగతా బ్లాగులు చూస్తున్నావ్ కానీ , నన్ను పట్టించుకోవా?

నేను : బాబు చాలు .మళ్ళి అలగకు

ఉత్తరం: నన్ను ఈ మధ్య ఒకరిద్దరు వీక్షకులు చూసారు

నేను : ఏమన్నారు నీ గురించి

ఉత్తరం: వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి అడుగు

నేను : ఏంటి వెటకారమా

ఉత్తరం: అంతే మొదట్లో నా బ్లాగు నా బ్లాగు అని తిరుగావు , ఇప్పుడు
నేను ఏమన్నా అది వెటకారంలగే ఉంటుంది నీకు
అంతే ఈ బ్లాగర్లు మారారు

నేను : ఇంతకీ నువ్వు ఎలా వున్నవో చెప్పాలా ?

ఉత్తరం: చూడటానికి అంత అందంగా లేను
నన్ను కొంచం గూగుల్ కి తీసుకువెళ్తే కొత్త టెంప్లేట్ తో మేకప్ వేసుకోవాలి

నేను : ఆహా ! ఇప్పుడు నీకు ఏమి తక్కువైన్దనో

ఉత్తరం: కనీసం అటు ఇటు ఆభరణాలుగా పెట్టే ప్రకటనలు కుడా లేవు .
కిరీటంలా పైన ధగ ధగా మెరుపులు లేవు .
మంచి ఫాంట్ ఉన్న బట్టలు లేవు . ఏదో మేకప్ లేని కళాకారిడిలా ఉన్న

నేను : చాలు చాలు నీ కోరికలు . ఇంకోసారి కొత్త టెంప్లేట్ అన్నావంటే ఉన్న టెంప్లేట్ తీసి పారేస్తా

ఉత్తరం: వద్దులే ఎలాగోలా నేనే సద్దుకుంటా

నేను : ఇంతకీ రోజూ ఏమిచేస్తున్నావ్

ఉత్తరం: ఏమి చేస్తాను , నీ గూగుల్ అనే ఖాతా లో కుర్చుని ఉన్న ,
ఎప్పుడో లాగ్ ఆఫ్ చేసి జైలులో పడేసావు

నేను : అవును, ఐతే

ఉత్తరం: ఎప్పుడూ ఇలా జైల్లో ఉండాలంటే కష్టంగా వుంది, ఒక్కసారి
నన్ను లాగిన్ అయ్యి బయట ప్రపంచానికి తీసుకెళ్ళవా

నేను : ఈ సారి ప్రపంచం కాదు విశ్వం మొత్తం చూపిస్తాను

ఉత్తరం: ఓహొ ! ఆహా ! లాలలా !!!

నేను : కాని ఓ షరతు

ఉత్తరం: ఏంటి

నేను : అన్ని బ్లాగులు చూసిన తరువాత , నాకు ఈ బ్లాగు నచ్చింది ,ఆ బ్లాగు నచ్చింది .
ఆ బ్లాగు బట్టలు బాగున్నాయి , ఈ బ్లాగు బట్టలు బాగున్నాయి అని అన్న వనుకో
నిన్ను ఏకంగా ఒకే సరి చంపేస్తా

ఉత్తరం: నా గురించి నీకు తెలీదా

నేను : కూతురు కాపురం అల్లుడుకి తెలీదా అని నా దగ్గరా నీ వేషాలు

ఉత్తరం: సరే నువ్వు చెప్పినట్టే వింటాలే అప్పుడు

నేను : ఇంతకీ నాకు ఈ ఉత్తరం ఎందుకు రాసావు

ఉత్తరం: వార్ని సినిమా అంతా చూసి హీరో కి హీరోయిన్ ఏమవుతుంది అంటే ఏమి చెబుతాం

నేను : ఇక చాలులే రేపు బ్లాగ్ లో కలుసుకుందాం

ఉత్తరం: అది కాదు . ఒక్క నిమి..........................


అంతా చీకటి , నేను లైట్ ఆఫ్ చేసేసాను. అప్పటిదాకా వున్నా అన్ని
ఆలోచనలనూ పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకున్నా

మళ్లీ తెల్లారింది రోజూలాగా ఆఫీసుకి బయల్దేరా , వెళ్తూ వెళ్తూ లెటర్ బాక్స్
చూసా మళ్లీ ఓ ఉత్తరం
ఆ ఉత్తరాన్ని లోపల పడేసి ఆఫీసుకి బయల్దేరా




ఈ సారి ఆ ఉత్తరం మీద ఇలా ఉంది

ఇక తరచుగా కలుద్దాం
- నీ 'తొలకరిజల్లు'

11 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

మాట నిలబెట్టుకోండి మరి...

Manjusha kotamraju చెప్పారు...

పాపం బ్లాగు మనసు ఎంతగ బాధపడుతోందో..అర్ధం చేసుకోండి కొద్దిగా అయిన

AB చెప్పారు...

Concept చాలా బావుంది రా, అక్కడక్కడ చమక్కులు బావున్నాయ్

Unknown చెప్పారు...

బావుంది సూపర్ ఉంది, మీ బ్లాగు సెన్సిటివ్ నెస్ కి పుట్టినల్లు, ఎందువలన అనే ప్రశ్న నేను అడుగుదామనే అనుకుంటా ? సుజన గారని బ్లాగూ అంతే...

రమ్య శ్వెత బూదరాజు చెప్పారు...

నా బ్లాగు నాకు ఎన్నో ఉత్తరాలు రాసింది. తెలిగ్రాములు కూడ ఇచ్చింది. కానీ కుదరడంలా.... ఆ కాన్సెప్ట్ చాలా బావుంది. బ్లాగుని ఓ వ్యక్తి లా చూసి అలా ప్రయోగంచేసి అది మాట్లాడుతుందని బహుశ తోటరాముడి తర్వాత మీరే రాశారు

. చెప్పారు...

చాల బాగా రాశారు శ్రీకాంత్ గారు
భలె నవ్వించారు మంచి ఆలోచన.....
మీ బ్లాగు పాపం ఎంత బాధ పదుతుందొ.........
www.tholiadugu.blogspot.com

శివ చెరువు చెప్పారు...

nijam gaa variety lo thadipesaaru..

meeru raasinave malli type (copy & Paste) chestunnananukoka pothe.. ee kinda linelu super ani cheppalani vundi..

"రూంకి వెళ్ళి వంట చేయాలి అని గుర్తు రాగానే

ఆనందంగా ఉన్న మనసు అదోరకంగా మారింది ."

"ఐనా నీకేం తెలుసు తండ్రి లేని కోడుకన్నా, బ్లాగరు లేని బ్లాగన్న
ఈ లోకానికి ఎప్పుడూ చులకనే"

"నన్ను కొంచం గూగుల్ కి తీసుకువెళ్తే కొత్త టెంప్లేట్ తో మేకప్ వేసుకోవాలి"


akkadakkada spelling mistakes unnai.. pedda tapa kada.. avakaasam leka poledhu.. o paali sooskondi..

ఇక తరచుగా కలుద్దాం :)

హను చెప్పారు...

papam danni marchipotea ela anDi

కౌటిల్య చెప్పారు...

శ్రీకాంత్!!అశ్విన్ బుజ్జితెర చిట్టిహాస్యవల్లరుల్లో నాకెంతో నచ్చిన పాత్ర...రాస్తూ కథను నడిపించే అశ్విన్ అంటే ఎంత అభిమానమో,మధ్యలో గిలిగింతలు పెట్టే "కాంతుగాడ"న్నా అంతే అభిమానం...బుడుగు బాబాయిలా...

అందుకే అశ్విన్ని కలిసిన మొదటిసారే పక్కనున్న ఫ్రెండుని చూసి,"శ్రీకాంతా"అని చాలా exciting గా అడిగా...తర్వాత శ్రీరాంని చూసి కూడా..అప్పుడు ఫోన్లో మాటాడి "మీ అభిమానినండీ" అని చెప్తే అర్థంకాక మెత్తగా మాటాడింది అసలు మన సులక్షణరెడ్డిని ఫోన్లో java,bsnl అంటూ వాయించిన శ్రీకాంతేనా అనిపించింది...కానీ వచ్చి ఈ తొలకరిజల్లుల్లో తడుస్తూంటే, "మన "కాంతుగాడి"కి నువ్వు మాకు చెప్పని చాలా othersides ఉన్నాయే అశ్వినూ" అని చెప్పాలనిపిస్తోంది....

అందుకే శ్రీకాంత్ గారూ ముందు మీకే చెప్తున్నా...మీ ప్రతి టపా చాలా vivid గా ఉంది...కథలైతే ఈనాడుఆదివారం లో మనసులోతుల్ని తాకే కథనాలకి ఏమాత్రం తీసిపోవు...అన్నీ కలిపిన చక్కటి స్వాతి పత్రికలా ఉంది.....మరి మీరిలా అర్థాంతరంగా ఆపేస్తే మీ బ్లాగే కాదు, మేం కూడా బాధపడి మీ ఇంటికి ఉత్తరాల్రాయాల్సొస్తుంది మరి...మాకు ఆ శ్రమ ఇవ్వకుండా మీరే మంచి "ఉత్తరాల" టపాల్ని మాకందిస్తారని ఆశిస్తూ..
మీ అభిమాని..

srikanth చెప్పారు...

అందరికీ ధన్యవాదములు

K SURENDRA BABU చెప్పారు...

మీ మీద ఎంత బెంగ ఉంటె తప్ప లెటర్స్ వ్రాస్తారు?ఓసారి వెళ్లి చూసిరండి.