1, జనవరి 2008, మంగళవారం

దిన ఫలాలు

పద్మావతీ: యావండీ లేస్తారా తెల్లారింది
వెంకటేశ్వర్లు: హా.....! వెళ్ళి ఈరోజు పేపరులో నా దిన ఫలం చూడు
పద్మావతీ: ఇదిగోండి పేపరు చదువుకోండి
===================================================================
నాయనా వెంకటేశ్వర్లు ఈరోజు నీకు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు, కొన్ని సందర్భాలలో అవమానపడతావు, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, కొత్త పనులు ప్రారంభించుట మంచిది కాదు, డబ్బు విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి.
===================================================================
వెంకటేశ్వర్లు: దేవుడా అన్ని కష్టాలు నాకేనా ??!!!
వెంకటేశ్వర్లు: కాస్త కాఫీ ఇవ్వవే
పద్మావతీ: పాలబ్బాయి నాగా పెట్టాడు
వెంకటేశ్వర్లు: చూసావా ఈరోజు నాకు మంచిదికాదు
పద్మావతీ: అబ్బా ఆపండి . ప్చ్ ! మీ పిచ్చితో నేను చస్తున్నాను, వెళ్ళి రెడీ అవ్వండి
పద్మావతీ: తొందరగా రండి లేటౌతోంది
వెంకటేశ్వర్లు: నేననుకున్నది ఈరోజు జరగదు
పద్మావతీ: అబ్బా త్వరగా టిఫిన్ చేసి వెళ్తే బస్సు దొరుకుతుంది లేకపొతే ఈరోజూ మిస్సే
వెంకటేశ్వర్లు: బస్సు దొరుకుతుందన్న నమ్మకం నాకులేదు. ఈరోజు నాకు మంచిదికాదు

(9:40 బస్సుకి 9:50 కి స్టాపుకు వెళ్లాడు)

వెంకటేశ్వర్లు: బాబు '22' బస్సు వెళ్ళిందా కాదు కాదు...వచ్చిందా
బాబు: వెళ్ళివచ్చింది
వెంకటేశ్వర్లు: ఈ ఆటోవాళ్ళు ఒకళ్ళు లేటైతేచాలు నా చుట్టునే తిరుగుతారు
వెంకటేశ్వర్లు: బాబు ఆటో మా ఆఫీసు దాక వస్తుందా
ఆటో: రండి మీకుంది
ఆటో: దిగండి వచ్చింది
వెంకటేశ్వర్లు: ఇదిగో యాభై, చిల్లరీ
ఆటో: ఆ! అది నా టిప్పు
వెంకటేశ్వర్లు: డబ్బు విషయంలో జాగ్రత్త అని ఉంది ఇదేకాబోలు

బాసు: రండి సార్ టైమెంత ? మీకిష్టమైనప్పుడు రావటానికి ఇదేమైనా ట్రిక్కు ట్రిక్కు అనుకున్నవా ?
వెంకటేశ్వర్లు: లేదు సార్ అది ....
బాసు: ప్రతిసారి చెప్పేదేగా
వెంకటేశ్వర్లు: నా దిన ఫలం బాలేదు సార్ అందుకే లేటైంది
బాసు: ????????!!!!!!!!
బాసు: తొందరగా వెళ్ళి నిన్నటి ఫైల్ పని చూడండి. అర్జంటుగా కావాలి
(రెండు గంటల తర్వాత)

బాసు: ఫైల్ పనైందా
వెంకటేశ్వర్లు: సార్ ఈరోజు నేనేపని మొదలు పెట్టకూడదు
బాసు: మీ బొంద అసలు నిన్ను..... ఆ ఫైల్ ఇటీ, గోపాలంగారు ఈపని తొందరగా చేసిపెట్టండి
బాసు: వెంకటేశ్వర్లు ఇంకెందుకయ్యా నువ్వు, పని చెయ్యమంటే నీ'దినం' అని మొదలెడతావు. ఛ్ఛ ఛస్తున్నా
వెంకటేశ్వర్లు: దేవుడా ఈరోజు తొందరగా గడిచేటట్లు చూడు.
(భోజనాల సమయమైంది)

గోపాలం: వెంకటేశ్వర్లు నీ కేరేజీ ఇటీ
గోపాలం: బాగుందయ్యా నీవంట
వెంకటేశ్వర్లు: దురదృష్టం అంటే ఇదేనేమో భొజనం ఉన్నా తినలేను
వెంకటేశ్వర్లు: తొందరగా ఇంటికి వెళ్ళి మళ్ళీ తినాలి
గోపాలం: ఏంటి వెంకటేశ్వర్లు అలావున్నావు
వెంకటేశ్వర్లు: నాదిన ఫలం ప్రకారం.........
గోపాలం: చాలు బుధి తక్కువై అడిగా

(సాయంత్రం ఆఫిసు నుంచి వెళ్తుండగా)

ఫ్రండ్: రేయ్ ఎలాఉన్నావ్
వెంకటేశ్వర్లు: బానే ఉన్నారా
ఫ్రండ్: ఏరా డబ్బులున్నాయా
వెంకటేశ్వర్లు: ఆ ఉన్నాయి
ఫ్రండ్: ఒక వెయ్యి ఇవ్వరా రేపు గారెంటీగా ఇవ్వటానికి ట్రైచేస్తా
వెంకటేశ్వర్లు: తీసుకో
ఫ్రండ్: ఉంటా మళ్ళీ కలుద్దాం
వెంకటేశ్వర్లు: డబ్బు జాగ్రత్తా అంటే ఇదేకాబోలు

(కష్టాల కన్నీరు మింగుకుంటూ ఇంటికి చేరాడు)

వెంకటేశ్వర్లు: పద్మావతీ ఈరోజు నాగతి.........
పద్మావతీ: నాకు తెలుసు, భొంచేయండి
పద్మావతీ: తొందరగా పడుకోండి, రేపు మళ్ళీ మీ దినం చూడాలిగా అదే దినఫలం చూడాలిగా

(మళ్ళి తెల్లారింది , కాని కధ తిరిగింది)

పద్మావతీ:యావండీ లేస్తారా తెల్లారింది
వెంకటేశ్వర్లు:హా.....! వెళ్ళి ఈరోజు పేపరులో నా దిన ఫలం చూడు
పద్మావతీ:ఇదిగోండి పేపరు చదువుకోండి

===================================================================

నాయనా వెంకటేశ్వర్లు ఈరోజు ఇరగదీసై

===================================================================

వెంకటేశ్వర్లు: పద్దూ! కాఫీ
వెంకటేశ్వర్లు: పది నిమిషాలలో రెడీ అవుతా టిఫిన్ చేసి బాక్స్ పెట్టు
వెంకటేశ్వర్లు: మర్చిపోయా కూరలో ఉప్పు తక్కువెయ్యి
పద్మావతీ: !?*!!!!!!!

వెంకటేశ్వర్లు: బాయ్ డార్లింగ్
పద్మావతీ: వస్తూ పళ్ళు తీసుకురండి
వెంకటేశ్వర్లు: ఓకే బాయ్

(బస్ స్టాపుకు వెళ్ళాక)

వెంకటేశ్వర్లు: ఈ సిటీ బస్సులు ఎప్పుడూలేటే, ఛ్ఛ!
వెంకటేశ్వర్లు: హమ్మయ్యా! ఈ బస్సుకు పదేళ్ళు
వెంకటేశ్వర్లు: టికెట్టు తీసుకోవాలా!! ఆ అక్కర్లేదులే
(ఆఫీసుకు వెళ్ళాడు)

బాస్: ఏంటీరోజు కరెక్టుగావచ్చావు
వెంకటేశ్వర్లు: ఈ రోజు నారోజు

(రెండు గంటల తర్వాత)

వెంకటేశ్వర్లు: ఇదిగోండి సార్ ఫైలు
బాస్: నువ్వు బాగా పని చేస్తావయ్యా
బాస్: గోపాలం వెంకటేశ్వర్లు దగ్గర నువ్వు పని ఎలా చేయాలో నేర్చుకోవాలయ్యా

(భోజన సమయం)

వెంకటేశ్వర్లు: నా కేరేజీ తీసుకో
గోపాలం గోపాలం: థాంక్స్ వెంకటేశ్వర్లు
గోపాలం: ఏంటి ఇది ఇలా ఉంది. ఇందులో ఉప్పు మర్చిపోయారు
వెంకటేశ్వర్లు: నీకు బి.పి ఉందిగా అందుకే తగ్గించా ఉప్పు, ఇక తిను

(సాయంత్రం ఆఫీసునుంచి వెళ్తుండగా)

ఫ్రండ్: ఇదిగోరా నిన్నటి వెయ్యి
వెంకటేశ్వర్లు: ఏంటి వెంటనే డబ్బలిచ్చేసావ్
వెంకటేశ్వర్లు: పద పళ్ళు కొనాలి
ఫ్రండ్: నేకొనిస్తా పద
ఫ్రండ్: తీసుకోరా పళ్ళు
ఫ్రండ్: రేయ్ నాకు ఒక పని చేసి పెట్టాలిరా అది *********
వెంకటేశ్వర్లు: ఆ పని నాది కాదురా, గోపాలంగారిది
వెంకటేశ్వర్లు: రేపు ఆఫీసుకు వచ్చి వారితో మాట్లడుకో
వెంకటేశ్వర్లు: ఉంటా!

(ఇంటికి చేరాడు)

వెంకటేశ్వర్లు: పద్దూ నాకు ఆలు కూర, టమాటొ పప్పు, రసం,..........చేసిపెట్టు
(భోజనాలైనాయి)

పద్మావతీ: పడుకోండి రేపెలాఉంటుందో

(తెల్లారింది)

పద్మావతీ: యావండీ లేస్తారా తెల్లారింది
వెంకటేశ్వర్లు: హా.....! వెళ్ళి ఈరోజు పేపరులో నా దిన ఫలం చూడు
పద్మావతీ: ఈరోజు పేపరు రాలేదు
వెంకటేశ్వర్లు: మరినా పరిస్థితి
పద్మావతీ: సబ్బులేని స్నానమే, వెళ్ళి రెడీ అవ్వండి.
....................................................................

5 కామెంట్‌లు:

Rajendra Devarapalli చెప్పారు...

చాలా బాగా నచ్చింది నాకు.ఈరోజు మనకున్న సౌలభ్యాన్ని బట్టి కనీసం 30 నుంచి 40 సోర్సెస్ ద్వారా దినఫలాలు చూసుకోవచ్చు.ఏ ఒక్కటీ ఇంకో దానితో సరిపోలదు.సానుకూల సంకేతాలతో మనిషి ఎంత ఉత్తేజితుడవుతాడు అనే దాన్ని బాగా చూయించారు.

Unknown చెప్పారు...

గురువుగారు నాకు పేపర్ రాదనే సమస్యే ఉండదు. నేను ఫాలో అయ్యేది గంటల పంచాగం గంటకోసారి చూసుకుంటా... బాగు బాగు ఆశావాది - నిరాశావాది మద్య వ్యత్యాసం ఒక మనిషిలో చూపించావు.

Unknown చెప్పారు...

బాగుంది టపా...

kiran చెప్పారు...

hihihihi nice one :)

శిశిర చెప్పారు...

బావుంది.