7, ఆగస్టు 2008, గురువారం
ఓ ఉత్తరం
అది ఇరవైవ శతాబ్దం , ఇంకా భారతదేశం లో చెప్పుకోదగ్గ అభివృధి చెందని రోజులు
దేశ సమాచారం తెలుసుకోవటానికి పత్రికలే దిక్కు.
భారత్ పాకిస్తాన్ల మద్య యుద్ధం జరుగుతున్న రోజులవి,
సరిహద్దు వద్ద భీకరమైన పోరు,
ఎంతోమంది తమప్రాణాలు దేశానికి అర్పించగా, ఇంకెంతోమంది క్షతగాత్రులైనారు.
తమ బిడ్డలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు వారి సమాచారం కోసం వేయి కళ్ళతో
వేచీ చూస్తున్నారు. వారికి ఏహాని జరుగకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
***********************************************************
' రామయ్యా నీకు ఉత్తరం వచ్చింది, నీ కొడుకు దగ్గరనుంచి ', అన్న ఆ పొస్టుమాను
మాట వినగానే ఆ తల్లిదండ్రులకి ఎనలేని ఆనందం కలిగింది.
రామయ్య కొద్దిగా చదువుకున్నాడు , అందువల్ల అతనికి ఉత్తరం రాయటం చదవటం తెలుసు .
కాని అతని భార్య సీతమ్మ చదువుకోలేదు , అందువల్ల రామయ్య
ఆ ఉత్తరాన్ని తన భార్యకు చదివి వినిపిస్తున్నాడు
రామయ్య : ' పూజ్యులైన తండ్రిగారికి నమస్కరించి వ్రాయునది ,
నేను ఇచ్చట క్షేమం మీరు అందరూ అక్కడ క్షేమంగా ఉన్నరని తలుస్తాను. '
సీతమ్మ : క్షేమమే బాబు , నువ్వు ఎలా ఉన్నావు
రామయ్య : నన్ను మొత్తం చదవనివ్వు , వాడు క్షేమంగానే ఉన్నాడంట
రామయ్య : ' ఇక్కడ యుద్ధం భీకరంగా ఉంది . ఎంతో మంది చనిపోయారు.'
సీతమ్మ : నువ్వు జాగ్రత్త బాబు , తొందరగా ఇంటికి వచ్చేయి
రామయ్య : వాడికి తెలుసు ఏమిచేయాలో
సీతమ్మ : మీరు చదవండి
రామయ్య : ' నా స్నేహితులు కూడా ఎంతోమంది చనిపోయారు.'
సీతమ్మ : అయ్యో పాపం
రామయ్య : ' నాన్నా మీకో విషయం చెప్పాలి '
సీతమ్మ : చెప్పు బాబు
రామయ్య : ' నాకు ఇక్కడ ఓ మంచి మిత్రుడు ఉన్నాడు
వాడు, నేను ఈ సారి మన ఊరు వస్తున్నాం '
సీతమ్మ : రమ్మనండి దానిదేముంది . ఎప్పుడు తీసుకు రమ్మన్నా వాడు
స్నేహితులని తేడు ఈ సారి మంచి బుద్ధి పుట్టినట్టుంది మనవాడికి
---తొందరగా చదవండి ఏమి రాసాడో
రామయ్య : నన్ను నువ్వు ఎక్కడ చదవనిస్తున్నావు
సీతమ్మ : సర్లేండి చదవండి
రామయ్య : ' కాని వాడికి యుద్ధములో ఓ కాలు ,ఓ చేయి పొయాయి
సీతమ్మ : అయ్యో పాపం , అతనిని తప్పకుండా తీసుకొని రమ్మనండి
అలాంటి వారికి సాయం చేస్తే మనకే మంచిది
రామయ్య : అలాగే చెబుతానులే
రామయ్య : ' వాడికి వాళ్ళ తల్లిదండ్రులూ చనిపోయారు '
సీతమ్మ : అతనిని తప్పకుండా తిసుకు రమ్మనండి చేతనైనంత సాయం చేద్దాం.
రామయ్య : అలాగే
సీతమ్మ : వాళ్ళ దగ్గరి వాళ్ళ వివరాలు కూడా వాడిని తెలుసుకోమనండి
రామయ్య : ముందు వాడు రాసిన ఉత్తరం మొత్తం చదవనివ్వు తరువాత
మనం రాసే ఉత్తరం గురించి ఆలోచించచ్చు
సీతమ్మ : సరె.. సరె.. మీరు చదవండి
రామయ్య : ' నాన్నా, అమ్మా నేను నా స్నేహితుడిని జీవితాంతం మన
ఇంట్లో ఉంచాలనుకుంటున్నాను '
సీతమ్మ : జీవితాంతమా !
జీవతాంతం చేయటమంటే కష్టం కదండి
రామయ్య : నేనూ అదే అనుకుంటున్నాను
ఓ రెండు మూడు నెలలైతే చేయచ్చుగాని తరువాత ఐతే కష్టమే.
మనకే ఇక్కడ చేసేవాళ్ళు లేరు , పైగా అతనికి కాళ్ళు చేతులు లేవు
ఈ పరిస్థితులలో అతనికి జీవితాంతం చేయటం చాలా కష్టం .
సీతమ్మ : ఈ విషయమే మనవాడికి కూడా చెప్పమనండి
పాపం అతని మనస్సు నొచ్చుకోకుండా చెప్పమనండి
రామయ్య : నాకూ పాపం అని అనిపిస్తోంది కాని ఏదో ధన సహాయం
ఐతే చేయొచ్చు గాని అతనికి జీవితాంతం సేవలు
చేయటం మాత్రం కష్టమే
సీతమ్మ : సరే తరువాత ఏమి రాసాడో చదవండి
రామయ్య : ' మీరు తప్పక నా మన్ననని మన్నిస్తారని ఆశిస్తున్నాను '
సీతమ్మ : మీరే వాడికి అర్థమైయ్యేటట్లు ఉత్తరం వ్రాయండి.
ఏదైన ధన సహాయం చేయమని చెప్పండి
రామయ్య : ' మీ ఆరోగ్యం జాగ్రత్త , అమ్మని కూడా జాగ్రత్తగా చుసుకోండి ,
అమ్మని అడిగానని చెప్పండి .
-ఇట్లు మీ కుమారు…
సీతమ్మ : ఈ దరిద్రపు యుద్ధాలవల్ల ఎంతమంది చనిపోతారో ...చ్చ ...!
రామయ్య : నేను పోస్టాఫీసుకెళ్ళి ఉత్తరం తెస్తాను
********************************************************
తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉత్తరం కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్న
ఆ సైనికుడికి తండ్రి రాసిన ఉత్తరం అందింది .
ప్రియమైన కుమారుడికి ,
మేము ఇచ్చట క్షేమం . నీవూ క్షేమమని తలుస్తాము . నీ ఉత్తరం అందింది .
ముందుగా మీ స్నేహితుడిని అడిగానని చెప్పు , నీవు నీ స్నేహితుని పరిస్థితి చెప్పావు .
అతని పరిస్థితి వినగానే మాకూ బాధ కలిగింది , అతనికి చేతనైనంత సహాయం చేద్దాం.
కాని ఇక్కడ మన పరిస్థితీ ఆలోచించు, మనమేమీ జమిందారులంకాదు .
అతన్ని జీవితాంతం చూడటం కష్టం రా, పైగా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు .
నువ్వే అతనిని అతని భంధువుల వద్దకు చేర్చు, వీలైనంత సహాయం చేయి .
ఉంటాము .అమ్మ నిన్ను అడిగాని చెప్పమంది. నువ్వు జాగ్రత్త .
ఎప్పుడు వచ్చేది మాకు తెలియజేయి.
ఆశిస్సులతో , నీ తండ్రి రామయ్య
**********************************************************
వారం తరువాత రామయ్యకు టెలిగ్రాము వచ్చింది ఆర్మి నుంచి .దాని సారాంశం
' రామయ్య గారు , మీకు ఈ విషయం తెలియజేయటానికి చింతిస్తున్నాము.
మీ కుమారుడు నిన్నరాత్రి ఆత్మహత్య చెసుకున్నాడు. మీరు ఇచ్చటకు ఒక సారి రావలేను.'
అని పొస్టుమాను ఈ వార్త చెప్పగానే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై ఏడ్చారు.
తమ కొడుకు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసుకోవడానికి వారు అక్కడికి వెళ్ళారు .
అక్కడి ఆర్మీవారు అతని శవాన్ని చూపించారు.
తమ కొడుకు శవాన్ని చూసిన ఆ తల్లి దండ్రులకు నోట మాట రాలేదు .
చనిపోయిన తమ కుమారుడికి ఒక చెయ్యి , ఒక కాలు లేవు.
(ఈ కధను నేను విన్న తరువాత ఒక ఉత్తరం మాద్యని ఉపయోగించి రాసినది )
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
24 కామెంట్‌లు:
ఏమండీ తొలకరి జల్లు గారు, ఏంటడీ ... అసలేంటని అడుగుతున్నాను మీ బ్లాగ్ లో అన్నీ చాలా సెన్సిటివ్ వి రాస్తారు, అసలు నాకు ఇది చదివి ఓ క్షణం నా నోట వెంట మాట రాలేదు. బుర్ర పని చేయలేదు. అబ్బా . చెప్పాలనుకున్న దానిని చాలా అద్భుతంగా , సున్నితంగా నే చెప్పారు. హాట్సాఫ్.
శ్రీకాంత్ చాలా బావుంది. అసలు ఆ లెటర్ కాన్సెప్ట్ మాత్రం సూపర్. Lively గా ఉంది. టపా. ఇది నిజంగా జరిగిన వాటికి మీరు టపా రాసినట్టుంది. సెన్సిటివ్ గా ఉంది...
చాలా బావుంది.
మహాద్భుతంగా రాశారు.
-- విహారి
చాలా బాగా వ్రాశారు !!!
శ్రీకాంత్ గారు నిజంగా చాలా బాగా రాసారు.
Hi srikanth,
I read it already some where in english but nuvvu danni telugulo raasina vidhanam undi chudu great.
It shows your feel on that story.Nice post.Keep writing
sir can i have u r template code....
నిజంగా సైనికులే మన హీరోలు. మనం ఇక్కడ హాయిగా ముసుగుదన్ని నిద్రపోతున్నామంటే దానికి కారణం వాళ్ళే.
ఎంతో సున్నితంగా చెప్పారు.
ఉహించలేని మలుపును తిప్పారు. గుండెని కదిలించింది.
good one.. పోస్ట్ కార్డ్ నేపధ్యం చాలా బావుంది!
మధ్యలో ఊహించా, వాళ్ల అబ్బాయే ఉత్తరం రాస్తున్నాడని. అది అవునో కాదో తెలుసుకోవటానికి కథ చివరంటా ఆసక్తిగా చదివాను. మీ కథనం బాగుంది.
ఈ మద్య కాలంలో ఇంత గొప్ప రచన చదవలేదు. నేను బ్లాగుల్లో కోరుకొనేది ఇదే. బ్లాగ్ లోకానికే వన్నె తెచ్చే రచన. ఎందుకూ పనికి రాని సోది, సొల్లు విషయాల మీద టపాలు, దాని మీద అర్థం కాని, అర్థం అవని discussions. ఈ లోకం లో నాకు మాత్రమె అన్ని వచ్చు, అన్ని తెలుసు.. అనే ఒక దురద, దుగ్ద .. ETV సుమన్ మాదిరి.. అందుకే కొందరి టపాలు చదవడమే మాని వేసాను. ఒక్కటి అంటే అక్కటి ఉపయోగం, ఉపకారం, అందరికి పనికి వచ్చే విషయాలు ఉండవు ఎంత వెదికినా.. ఏదో తమ బాష పటిమ (ENGLISH లో కూడా), తమ పరిజ్ఞానం.. అది ఎవరికీ ఉపయోగ పడక పోయినా.. ప్రదర్శించు కొనటానికి తప్ప.. దేనికి పనికి రాని చెత్త రాస్తున్నారు. VERY VERY GOOD. ఇంకా రాయండి. రాస్తూ ఉండండి. BEST WISHES.
ఈ కథ నేను యండమూరి "విజయానికి ఆరోమెట్టు" లో అనుకుంటా, చదివాను. కానీ మీరు ఈ కథకు అద్దిన కథనం చాలా బాగుంది.
@ aradhana గారు ఒక సారి ఈ లింకు చూడండి
code అక్కడ ఉంటుంది
http://www.finalsense.com/services/blog_templates/photoshop_template.htm
చివర ఒక్క క్షణం గుండె ఆగినట్టనిపించింది.
సున్నితమైన సంగతి.. కానీ...
@ క్రాంతి కుమార్ మలినేని గారు, @ కత్తి మహేష్ కుమార్ గారు , @ all
ఈ కధ ను ఎవరో చెబుతుంటే విన్నాను
నాకు ఈ కధ బాగా నచ్చిందండి
ఓ క్షణం గుండె బరువెక్కుంది
అంత మంచి కధ మన బ్లాగర్లు miss కాకూడదని వ్రాశాను
@suma గారు, @అశ్విన్ బూదరాజు ,
@MURALI గారు, @విహారి గారు,
@ప్రపుల్ల చంద్ర గారు, @మీనాక్షి గారు ,
@కల గారు, @ప్రతాప్ గారు,
@నిషిగంధ గారు , @cbrao గారు,
@krishna rao jallipalli గారు
ధన్యవాదాలు
@ ramya గారు
మీ సందేహము తెలుసుకోవచ్చా?
excellent
bollojubaba
ఏమీ అనుకోకపోతే....ఇది చాలా ఫార0స్ లోను,ఫార్వర్డ్ మైల్స్ లోనలోఇ0కా చాలా చోట్ల చదివాను.ఇది మీరు రాసి0దేనా?ఏదయితే ఏము0ది...మళ్ళా ఒక్కసారి గు0డె బరువు పె0చారు.
Wow
ఎలా మిస్సయ్యాను ఇది?
adara koteru..na manasuni kulakoteru me ratha tho
కామెంట్‌ను పోస్ట్ చేయండి